నెలలు గడుస్తున్నా అందని కొనుగోళ్ల డబ్బులు

– మండలంలో 4 వేల ఎకరాల్లో వరిసాగు
– 98 వేల క్వింటాళ్ల వడ్లు కొనుగోలు
– ఇప్పటికి 40 శాతం రైతులు డబ్బుల కోసం నిరీక్షణ
నవతెలంగాణ-తాండూర్‌ రూరల్‌
తాండూరు మండలంలోని గోనూరు, వీరుశెట్టిపల్లి, నారాయణపూర్‌, చెంగోల్‌, బెల్కటూర్‌, చింతామణి ప ట్నం, పర్వతాపూర్‌, అంతారం ఖాజాపూర్‌, అల్లాపూర్‌, ఎ ల్మకన్నా, చెంగేస్‌పూర్‌, బిజ్వార్‌, బొంకూర్‌, తదితర గ్రా మాల్లో యాసంగి వరి పంట 4 వేల ఎకరాల్లో సాగు చేశా రు. సుమారు 98 వేల క్వింటాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇప్ప టికి 40 శాతం మంది రైతులకు డబ్బులు అందలేదు. ఆరు గాలం కష్టపడి పండించిన పంట విక్రయించి సమ యా నికి డబ్బులు రాకపోవడంతో రైతులు చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేసిన 4 రోజుల్లోనే. రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని గొప్పలు చెప్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు. పంట పండించి విక్ర యించేం దుకు గోనే సంచుల కోసం నెల రోజులు నిరీక్షణ చేసి విక్ర యించి నెల రోజులు దాటినా కూడా డబ్బులు అందకపో వడం ఏంటని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రైతు లకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని పంట పెట్టుబడి సాయం అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న తీరా చూస్తే రైతులకు సమయానికి డబ్బులు రాక నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా నెల రోజు ల క్రితం ఏసిన రైతులకు పడని డబ్బులు 20 రోజుల క్రితం వేసిన కొందరు రైతులకు డబ్బులు జమ అయిపో యాయి. తాండూరు మండలంతో పాటు తాండూర్‌ ని యోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌, మం డలాల రైతుల పరిస్థితి ఇదేవిధంగా ఉంది. కాబట్టి అధికా రులు వెంటనే స్పందించి ధాన్యం విక్రయించిన ప్రతి రైతు కూ వెంటనే డబ్బులు అందేలా చూడాలని లేని యెడల ఆందోళన చేపటడతామని వివిధ గ్రామాల రైతులు తెలిపారు.