నవతెలంగాణ-అశ్వారావుపేట
ఈ ఏడాది వ్యవసాయ అదును సమయం దగ్గర పడటంతో త్వరలో నూతన సాగుదారులకు ఆయిల్ఫెడ్ మొక్కలు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మొక్క పెరుగుదల, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడానికి ఉద్యాన నిపుణుల బృందం ఆదివారం స్థానిక ఫాం ఆయిల్ కేంద్రీయ నర్సరీని సందర్శించి మొక్కలును పరిశీలించారు. పీపీఈ రాహుల్ మిశ్రా, డిఐఎ ఉమాదేవి, పీపీఓ రామక్రిష్ణా రెడ్డిలు ఫాం ఆయిల్ మొక్కలు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసారు. పంపిణీ సమయంలో మొక్కలు పాట్లు తీసుకోవాల్సిన పలు భద్రత చర్యలను ఆయిల్ఫెడ్ డి.ఒ బాలక్రిష్ణకు వివరించారు. ఈ కార్యక్రమంలో మీ ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ రాధా క్రిష్ణ, ఏరియా ఆఫీసర్ మహేష్, ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్‌లు ఉన్నారు.