ఎఫ్‌టీసీసీఐ నూతన వైస్‌ ప్రెసిడెంట్‌గా ఆర్‌.రవికుమార్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఎఫ్‌టీసీసీఐ) నూతన వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త రాచకొండ రవికుమార్‌ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మేనేజింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన్ను ఎన్నుకున్నారు. ఏడాది పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు ఎఫ్‌టీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.