దేశ యువతకు ఆదర్శం రాజీవ్‌ గాంధీ

– టిపిసిసి జనరల్‌ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ
– ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌ గాందీ వర్ధంతి
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశ యువతకు ఆదర్శం రాజీవ్‌ గాంధీ అని టిపిసిసి జనరల్‌ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ అన్నారు. ఆదివారం కొత్తగూడెం నియోజకవర్గం స్థానిక బస్టాండ్‌ సెంటర్‌ రైటర్‌ బస్తిలో గల జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో టిపిసిసి జనరల్‌ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ అధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌ గాంధీ వర్ధంతి నిర్వహించారు. ముందుగా రాజీవ్‌ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏడవల్లి మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఫిరోజ్‌ గాంధీ ల పెద్ద కుమారుడు భారత దేశ 6వ ప్రధాన మంత్రిగా అతి తక్కువ వయసులో దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని చెప్పారు. భారత దేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన దృవతార, ఐటి రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరు పేదలకు అండగా నిలిచిన ఆపద్భాందవుడు రాజీవ్‌ గాంధీఅని నివాళి అర్పించారు. ఈ కార్యక్రమములో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు రాయల శాంతయ్య, అంతోటి పాల్‌, ఐఎన్‌టియూసి నాయకులు జేలిల్‌, కాలం నాగభూషణం, సుబ్బా రెడ్డి, మహిళా మైనార్టీ పట్టణ అధ్యక్షురాలు జేరిన, అక్బర్‌, కొలిపాక సత్యనారాయణ, సారంగా పాణి తదితరులు పాల్గొన్నారు.
పినపాక : మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా పినపాక మండలం ఈ.బయ్యారం గ్రామంలో గల రాజీవ్‌ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రామనాథం మాట్లాడుతూ భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధృవతార, ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్భాందవుడు రాజీవ్‌ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల రైతు కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు ఏలూరి వెంకటేశ్వర రెడ్డి, పినపాక నియోజకవర్గం మైనార్టీ సెల్‌ అధ్యక్షులు ఎండి బసీరుద్దీన్‌, మండల కార్యదర్శి జక్కా వెంకటేశ్వర్లు, పినపాక మండల ముస్లిం మైనార్టీ సెల్‌ అధ్యక్షులు ఎస్‌.కె మదర్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు జాడి రాంబాబు, ఉపాధ్యక్షులు అత్తె లక్ష్మీనారాయణ, గంగిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, యాలం బుజ్జిబాబు, కొమరం రమేష్‌, మలకం మహేష్‌, బడే సుధాకర్‌, మలకం కార్తీక్‌, యాలం గాంధీ, తదితరులు పాల్గొన్నారు.
చర్ల : యావత్‌ ప్రపంచంలోనే భారతదేశం సాంకేతికంగా అభివృద్ధి చెందిందంటే దానికి మూల కారణం రాజీవ్‌ గాంధీ అని టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్‌ అన్నారు. ఆదివారం భారత రత్న మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా చర్ల మండలం సత్యనారాయణ పురం గ్రామం నందు గల రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాలతో సాంకేతిక రంగంలో నేడు భారతదేశం పోటీ పడుతుందంటే దాని వెనుక రాజీవ్‌ గాంధీ కృషి వర్ణించలేనిదని ఆయన పునర్గాటించారు. భారతదేశ అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించి దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ఆయన కీర్తించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు ఆవుల విజయ భాస్కర్‌ రెడ్డి, ఎంపీపీ కోదండరామయ్య, ఎంపీటీసీలు మడకం పద్మజ, కుంజా నాగేశ్వరరావు, తాటి రామకృష్ణ, ముత్యాల శివప్రసాద్‌, సర్పంచులు యలకం నరేంద్ర, ఉప సర్పంచ్‌ గడిదేసివిద్యాసాగర్‌, నాయకులు ఇందుకుర్తి సత్యనారయణ రాజు, ఇందుల బుజ్జి, రమేష్‌, భాస్కర్‌, పొగాకు సత్తిబాబు, సత్యనాదం బట్టా బాలకృష్ణ, సుధాకర్‌, నాగరాజు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : చివరి శ్వాస ఉన్నంత వరకు దేశం కోసం అవిశ్రాంతంగా శ్రమించిన ధీరుడు, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్భాందవుడు, దేశాన్ని ప్రగతి బాటలో నడిపిన అజరామరుడు, ప్రగతిశీలుడు, భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ అని కాంగ్రెస్‌ మండల ప్రెసిడెంట్‌ తుమ్మ రాంబాబు అన్నారు. రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం మూడు రోడ్ల కూడలిలో గల వై.ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహం వద్ద రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మండల అద్యక్షులు ఉప్పల రాజశేఖర్‌, నాయకులు నరదల సర్వేశ్వరరావు, కొప్పుల శ్రీను, సత్యం రామకృష్ణ, నరదల మణికంఠ అశ్వారావుపేట మండల సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ కేపీ షఫీ, పేరాయిగూడెం వార్డ్‌ నెంబర్‌, ఎస్‌.కే అన్వర్‌, రామకృష్ణ, చంద్రరావు, నార్లపాటి బుచ్చిబాబు, తగరం విశ్వనాథం తదిపర్లు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : సమాచార విప్లవకారుడు రాజీవ్‌ గాంధీయే అని, ఆయన కాలంలోనే టెలికాం రంగం అభివృద్ధికి నోచుకుందని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మొగళ్ళపు చెన్నకేశవరావు అన్నారు. ఆయన వర్ధంతిని స్థానిక కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రం పటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం నివాళులు అర్పించారు. సాంకేతిక పరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.టి.సి లు భారతి, తిరుమల బాలగంగాధర్‌, కో – ఆప్షన్‌ సభ్యులు ఎస్‌.కే పాషా, దన్జూ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి : మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్‌ గాంధీ 32వ వర్ధంతిని ములకలపల్లిలో మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్రావు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ మెంబర్‌, జడ్పీటీసీ సున్నం నాగమణి పాల్గొని రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశాన్ని అనేకరంగాల్లో అభివృద్ధి చేసిన ధృవతార ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్భాంధవుడు, యువతకు 18ఏళ్లకే ఓటుహక్కును కల్పిస్తూ యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేలా చేసిన సంస్కరణ కర్త రాజీవ్‌ గాంధీ అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మండల అధ్యక్షుడు పుష్పాల హనుమంతు, ఆర్‌ఎంపీ గోపి, కిసాన్‌ సెల్‌ వనమా వేదేశ్వరరావు, రత్నభూషణం, ఖాదర్‌ బాబా, మెడిశెట్టి సూరయ్య, పసుపులేటి గణపతి, వనమా వెంకయ్య, కారం రవి తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు వనమా గాంధీ ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ 32వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.దేశానికి చెందిన సేవ పేద ప్రజలు కోసం చేసిన పనులను వర్ధంతిని సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.సి సెల్‌ మండల అధ్యక్షులు జమలయ్య, నరసింహ, మహేష్‌, చెన్నారావు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.