రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి

– జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ -కంటేశ్వర్
రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి అని నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం భారతరత్న స్వర్గీయ డాక్టర్ రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నందు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి, అదేవిధంగా వినాయక్ నగర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని యువతకు ప్రజాస్వామ్యంలో హక్కు కల్పించడానికి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ  అని, భారతదేశం సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలతో కలిసి ముందుకు వెళుతుంది అంటే అది కేవలం రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన సాంకేతిక విప్లవం ద్వారానే సాధ్యమైందని ,సాంకేతిక రంగంలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన గొప్ప ఘనత రాజీవ్ గాంధీ దే అని ప్రతిపక్షాలు కూడా ఆయనను కీర్తించాయని, వివిధ దేశాలలో ప్రస్తుతం సీఈవోలుగా ఉన్న వ్యక్తులే రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవానికి ఉదాహరణ అని ఆయన అన్నారు. గాంధీ గారు కలలు కన్నట్టు గ్రామ స్వరాజ్యం బలంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని రాజీవ్ గాంధీ నమ్మి రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ చట్టం తీసుకు వచ్చి గ్రామపంచాయతీలకే నేరుగా నిధులు విడుదల చేశారని,దీర్ఘకాలిక ఆలోచనలతో రాజీవ్ గాంధీ గారు దేశాన్ని అభివృధి పథంలో నడిపారాణి,కానీ ఇప్పుడు వున్న బీజేపీ నాయకులు రాజీవ్ గాంధీ ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని,దీనిని జిల్లా కాంగ్రెస్ నాయకులు తిప్పి కొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు రాజీవ్ గాంధీ  ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, బిజెపి ప్రభుత్వం రాజీవ్ గాంధీ ని ఆయన కుటుంబ సభ్యులను తక్కువ చేయడాన్ని ఎక్కడికక్కడ ఖండించాలని ఆయన అన్నారు.
     ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందన్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశంలోని యువతకు దిశా నిర్దేశం చేసిన మహనీయుడని,18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించిన గొప్ప మనిషి రాజీవ్ గాంధీ గారని, గ్రామాలు బాగుపడాలంటే నిధులను స్వేచ్ఛగా వినియోగించుకోవాలంటే అది కేవలం పంచాయతీరాజ్ చట్టం ద్వారానే సాధ్యమవుతుందని 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ ని ,రాజీవ్ గాంధీ చేసిన దీర్ఘకాలిక ఆలోచన వల్లనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి,మాజీ బిసి సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్,నియోజకవర్గ కో ఆర్డినేటర్ మజీద్ ఖాన్,రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, జిల్లా బిసి సెల్ అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,పిసిసి మెంబర్ ఈసా,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుధాకర్ రావు ,నగర మైనారిటీ అధ్యక్షులు ఏజాజ్,నగణ ఎస్సీ అధ్యక్షులు వినయ్,ధర్మ గౌడ్,నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు సుభాష్  తదితరులు పాల్గొన్నారు.