డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ..

నవతెలంగాణ – నవీపేట్
డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నవీపేట్ సిహెచ్ సి, బినోల పిహెచ్ సి లలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం బినోల పిహెచ్ సిలో  వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. డెంగ్యూ సోకిన వారికి అందించాల్సిన చికిత్స గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని కావ్య, డాక్టర్ ప్రేమలత, వెంకటేశ్వర్ రావ్, సూపర్వైజర్ కిషన్, పుష్ప, ఏఎన్ఎంలు మరియు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.