నవతెలంగాణ-ఖమ్మం
వంకాయలపాటి రమణ ప్రసాద్ 60వ జయంతిని ఖమ్మం వివిసి గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజరు మాట్లాడుతూ రాజా నాకు చెడ్డీ దోస్త్ అని అన్నారు. ఈ వివిసి వివిఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిసేవ కార్యక్రమం నా చేతులమీదుగా ఎన్నో చేశానని, కరోనా సమయంలో పేదవారికి, నిరుపేద మెకానిక్ కుటుంబాలకు రేషన్ సరుకులు ఇవ్వడం జరిగిందని, అదే కరోనా సమయంలో చాలా సంస్థలు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డాయని, కానీ వీవీసీ, వీవీఆర్ గ్రూప్ మాత్రం ప్రతి ఉద్యోగికి జీతాలు ఇచ్చిందని అన్నారు. వివిసి బ్రాండ్‌ని క్రియేట్ చేసిన వంకాయలపాటి వీరయ్య చౌదరి, ఆ గ్రూప్‌ని వివిసి విఆర్‌ఏ గ్రూప్ గా ఈ ఇద్దరు అన్నదమ్ములు విస్తరించారని కానీ ఎప్పుడు రమణ ప్రసాద్ లేని లోటుని వివిసి రాజా కొన్ని వేల కుటుంబాలు పెద్దదిక్కుగా వసుదైక కుటుంబంగా మీతో కలసి ఉన్నారని అన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ వీరయ్య చౌదరితో నాకు ప్రత్యేక అనుబంధమున్నదని గుర్తు చేసుకున్నారు. వివిసి విఆర్‌ఏ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ప్రతి సంవత్సరం వివిసి విఆర్‌ఏ గ్రూప్ ఉద్యోగులు వివిసి వివిఆర్ ట్రస్ట్ ద్వారా రక్త దానం చేయడం జరిగిందన్నారు. 60వ జయంతి సందర్భంగా మన ఖమ్మం వైకుంఠధామంనకు ఒక వైకుంఠరథం, నాగులవంచనకు ఓక మంచి నీటి ఆర్వో ప్యూరిఫైడ్ ప్లాంట్ ను మా వివిసి వివిఆర్ ట్రస్ట్ ద్వారా అతిత్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. త్వరలో బోడేపూడి విజ్ఞాన కేంద్రం ద్వారా మా వివిసి వివిఆర్ ట్రస్ట్ ద్వారా జనరిక్ మెడిసిన్స్ వైరా రోడ్ లో అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. వివిసి వివిఆర్ గ్రూప్‌లో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులను వివిసి రాజా, సంస్థ డైరెక్టర్స్ వంకాయలపాటి వీరేన్ చోదరి, వంకాయలపాటి వికాస్ చౌదరి, వంకాయలపాటి ఆదిత్య చౌదరి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ ద్రౌపతి, జీఎంలు, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.