నిబద్దత గల ఆదర్శనేత రాములు మేస్త్రీ

సీపీఐ(ఎం) అభివృద్ధికి విశేష కృషి
– సంస్మరణ సభలో రాష్ట్ర కమిటీ
– సభ్యులు సోమయ్య, భారతి
నవతెలంగాణ-ఇల్లందు
నమ్మిన సిద్దాంత కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు నిబద్దత గల ఆదర్శనేత రాములు మేస్త్రీ అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సోమయ్య, మాచర్ల భారతి అన్నారు. స్థానిక జెకె క్లబ్‌లో బుధవారం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సోమయ్య, మాచర్ల భారతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటి సభ్యులు రేపాలకు శ్రీనివాస్‌, ఖమ్మం జిల్లా కమిటి సభ్యులు మెరుగు సత్యనారాయణ, సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారవు,ఇల్లందు మండల కార్యదర్శి అబ్దుల్‌ నబి, నాయకులు కూకట్ల శకంర్‌, ఆలేటి కిరన్‌,టిబిజికెఎస్‌ నేత కనగాల పేరయ్య, బ్రాంచి మాజీ కార్యదర్శి, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు భూపెల్లి నర్సయ్య, రాజమౌళి పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లా దుర్గం రాములు మేస్త్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మాట్లాడారు. 1980వ దశకంలో రాములు మేస్త్రీ ఇల్లు ఒక కార్యాలయంలా కొనసాగేదన్నారు. మండలం, పట్టణంలో పార్టీ కార్యక్రమాలు, సమావేశాలకు వారి దిశానిర్ధేశం చేయడానికి వారి ఇల్లే ఒక వేదికలా ఉందన్నారు. వారి భార్య సత్తెమ్మ కార్యకర్తలను, నాయకులను ఎంతో అభిమానంతో ఆప్యాయంగా పలకరిస్తు భోజనాలు, టీలు ఇస్తుండేవారని అన్నారు. పార్టీ, మహిళా సంఘం అభివృద్ధి కోసం చేదోడుగా నిలిచేవారని అన్నారు. వారి కుటుంబ సబ్యులను సైతం పార్టీ అభివృద్ధికి దోహదపడ్దారని అన్నారు. 1987లో తొలి మున్సిపాలిటీ గెలుపొందడానికి చేసిన కృషి అపారం అన్నారు. వారి ఆశయాలు ముందుకు తీసుకుపోవడమే నేటి కర్తవ్యమని వారికిచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఎర్రజెండాను నిలబెట్టి ప్రజలకోసం పనిచేశారు : సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారవు
నాడు సీపిఐ, సిపిఎం మద్య విభేదాలు, ఉద్రిక్తలు, దాడులు ఉన్న సమయంలో కార్యకర్తలను ఏకం చేసి ఎర్ర జెండాను నిలబెట్టిన మహానీయుడని కొనియాడారు. బొగ్గుబావుల్లో సిఐటియు ఎదుగుదలకు ఎంతో కృషి సల్పారని అన్నారు. సమసమాజ మార్పుకోసం లక్ష్యంతో పనిచేశారని అన్నారు. వారిలో రాములు మేస్త్రి ఒకరని అన్నారు. రోజుకోపార్టీ మారుతు డబ్బుకోసం అమ్ముడుపోతున్న ఈకాలంలో మార్క్జిసం కోసం తను నమ్మిన సిద్దాంతకోసం జీవితాంతం కమ్యూనిస్టుగానే ఉన్నారని అన్నారు. నాటి నాయకులు, కార్యకర్తలు భూపెల్లి నర్సయ్య, రాజమౌళి, జెండాల నాగేశ్వరరావు, మాచర్ల భారతి, మాచర్ల గోపాల్‌ ఇలా ఎందరో సంస్మరణ సభకు రావడం అందరిని కలుసుకోవడం సంతోసకరమన్నారు.
అంకిత భావంతో పనిచేశారు : సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యురాలు భారతి
పార్టీ పౌండర్‌గా అంకితభావంతో రాములు మేస్త్రీ పనిచేశారని అన్నారు. మహిళలను సొంత చెల్లెలుగా చూశారని అన్నారు. మహిళా సంఘాన్ని సిఐటియు కార్యక్రమాల్లో కలుపుకుపోయి కార్యక్రమాలు ఉధృతం చేశారని అన్నారు. సిఐటియు,మహిళా సంఘం ఎదుగుదలకు కృషి చేశారని అన్నారు. కడవరకు సమాజ మార్పుకోసం పరితపించారని అన్నారు.
బాధ్యతగా పనిచేసి అందరి మన్ననలు పొందారు : సిఐటియు బ్రాంచి మాజీ కార్యదర్శి, సిపిఎం సీనియర్‌ నేత భూపెల్లి నర్సయ్య
పార్టీ ఇచ్చిన ఆదేశాలు,నిబంధనల ప్రకారం బాద్యతగా పనిచేసి అన్ని శాఖల్లో పార్టీ బలోపేతం చేయడంలో విజయం సాధించారని అన్నారు. రహస్య సమావేశాలు సైతం నిర్వహించి కొత్త క్యాడర్‌ తీసుకొచ్చి పార్టీ బలోపేతం చేయడంలో కృతనిశ్చిత్యులయ్యారని అన్నారు. ఏఐటియుసి, సిపిఐ బెదిరింపులు, ఉద్రిక్తల మధ్య పోలంపల్లి బొగ్గుబావి వద్ద రెండు శాఖలు ఏర్పాటు చేయడం మరిచిపోలేని విషయం అన్నారు. ఎంతో ధైర్యం,సాహాసంతో పార్టీని నిలబెట్టిన మహానేతని కొనియాడారు.
ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడమే నిజమైన నివాళి : మండల కార్యదర్శి నబి
రాములు మేస్త్రీ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడమే నిజమైన నివాళి అన్నారు. ఆయన మార్గలో నేటి యువత నడాలన్నారు.