నవతెలంగాణ-మణుగూరు
గత కొన్ని సంవత్సరాలుగా మణుగూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొన్న మీ రవళి సెల్ పాయింట్ 18వ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు. నిర్వహించిన వంద రోజుల బంపర్ డ్రా 2024 విజేత మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో పని చేస్తున్న రవి కుమార్ డీఎస్పీ ఎస్.వీ.రాఘవేందర్ రావు సమక్షంలో తీసిన డ్రాలో మొదటి బహుమతిగా హౌండా షైన్ వాహనాన్ని రవి కుమార్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ..స్వశక్తితో ఇతర కార్పొరేట్ సెల్ కంపెనీల తాకిడిని తట్టుకొని ఈ ప్రాంత ప్రజలకు తనవంతుగా బంపర్ డ్రాల పేరుతో ఖరీదైన బహుమతులు అందించడం నిజంగా అభినందనీయం అన్నారు. అనంతరం బైక్ గెలుచుకున్న విజేత రవి కుమార్‌కి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది బహుమతులుగా స్మార్ట్ వాచ్‌లను అందచేశారు. ఈ కార్యక్రమంలో పసునూరి రాము, యాదగిరి రామారావు, ప్రముఖులు పాల్గొన్నారు.