హరి నగర్ లో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి: రవి చారి

నవతెలంగాణ – హైదరాబాద్
రాంనగర్ డివిజన్ పరిధిలోని హరి నగర్, వైట్ హౌస్ హోటల్, రిసాలగడ్డ తదితర ప్రాంతాలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని రామ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కే. రవి చారికి స్థానికులు ఫిర్యాదు చేయడంతో జలమండలి డీజీఎం మోహన్ రావు దృష్టికి తీసుకుపోయి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.