– మల్లు భట్టి, లింగాల కమల్‌రాజు పదవుల కోసం పాకులాట
– అవకాశవాద రాజకీయాలకు చోటు లేదు
– అభివృద్ధికి నోచుకోని మధిర
– సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ-ముదిగొండ
రామన్న అసెంబ్లీ ఎన్నికల్లో మధిర గడ్డపై ఎర్రజెండా గెలవడం ఖాయమని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి చిరుమర్రిలో జరిగిన సభలో పోతినేని ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.సిపిఐ(ఎం) ఎమ్మెల్యేలుగా గెలిచిన బోడెపూడి వెంకటేశ్వరరావు,కట్ట వెంకటనరసయ్య హయాంలోనే మధిర అభివద్ధి జరిగిందన్నారు. పదవులు,అధికారం కోసం పాకులాడే కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలను ఓడించాలన్నారు.జన సమస్యలపై నిత్యం పోరాడే ఉద్యమ నాయకులను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ప్రజా సమస్యలతోపాటు, పల్లెలు అభివద్ధివుతాయన్నారు.అవకాశవాదం అభివృద్ధి పట్టని నాయకులను చిత్తుగా ఓడించి సుత్తి కొడవలి నక్షత్రంపై అత్యధిక ఓట్లు వేసి పాలడుగు భాస్కర్ ను గెలిపించాలన్నారు.అవకాశవాద రాజకీయాల కోసం పార్టీలు మార్చే లింగాల కమల్ రాజును,మధిరలో మూడుసార్లు గెలిచి ఉన్నత పదవులు అనుభవిస్తూ, సొంత ప్రయోజనాల కోసం మధిర నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా అభివృద్ధిని ఆమడ దూరంలో ఉంచిన మల్లు భట్టిని ఓడించి సిపిఐ(ఎం) అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపాలన్నారు మధిర నియోజకవర్గంలో ఉన్న రోడ్లను చూస్తే భట్టి చేసిన అభివృద్ధి కనపడుతుందన్నారు.చిరుమర్రి గ్రామం చైతన్యానికి ప్రతికని, ఆదర్శ గ్రామమని ఎర్ర జెండాకు తిరుగులేదని పోతినేని స్పష్టం చేశారు. సిపిఐ(ఎం) అభ్యర్థి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న తను గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో ప్రజా గొంతుక అవుతానన్నారు. సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బండి రమేష్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ(ఎం) అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ను అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.బూర్జవ పార్టీల నాయకులను ఓడించి ప్రజానాయకులను గెలిపించాలన్నారు. బారాస,కాంగ్రెస్ పార్టీల నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్, బండి పద్మ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, కోలేటి ఉపేందర్, వై రవికుమార్, టిఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య, పయ్యావుల ప్రభావతి, సామినేని రాంబాబు, బండి శేఖర్, మోర రామకృష్ణ, సామినేని మంగయ్య తదితరులు పాల్గొన్నారు.