వీఆర్‌ఏల పోరాటాల ఫలితమే.. రెగ్యులరైజేషన్‌

– సీఐటీయూ హర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వీఆర్‌ఏల పోరాటాల ఫలితం గానే రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజేషన్‌ చేసిందనీ, సానుకూలంగా స్పందిం చిన రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం పట్ల సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గురువారం ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యా ప్తంగా సుదీర్ఘ కాలం నిరవధిక సమ్మె, ఆందోళనా పోరాటాలతో సాగిన వీఆ ర్‌ఏల ఉద్యమం పట్ల ప్రభుత్వం సాను కూలంగా స్పందించటం హర్షణీయ మని తెలిపారు.ఈ పోరాటంలో నిక రంగా నిలబడిన సీఐటీయూ అనుబ ంధ వీఆర్‌ఏల యూనియన్‌ నాయక త్వాన్ని సీఐటీయూ అభినందించింది.