బకాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రిలీజ్‌ చేయాలి

– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి
నవతెలంగాణ-పరిగి
విద్యార్థులకు బకాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెం టనే రిలీజ్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఆగ స్టు 8 నుండి 11వతేదీ వరకు వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా విద్యారంగ అభివృద్ధికి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జరిగే జీపు జాతను మంగళవారం పరిగి పట్టణ కేంద్రంలోని కొడం గల్‌ చౌరస్తాలో జెండా ఊపి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి ప్రారంభించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి, మాజీ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు ఎం.వెంకటయ్య, మా ట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేజీ టు పీజీ ఉచిత విద్యా సంక్షేమమే తమ ధ్యేయంగా ప్రభుత్వం ప్రకటించిందని కానీ అధికారం చేపట్టి నేటికి 9 ఏండ్లు పూర్తవుతున్న సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల సమస్యలు పరి ష్కారం చేసే పరిస్థితి లేదని విమర్శించారు. రోజురోజుకీ పెరుగుతున్న నిత్యవసర ధరలు మాత్రం ఆకాశనంటుతు న్నాయని అన్నారు. కానీ పేద విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచడం లేదన్నారు. జిల్లాలో ఉన్న హాస్టల్స్‌ సమస్యల నిలయాలుగా మారాయని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత దారుణంగా తయారు చేశారని ప్రభుత్వ విద్యాసంస్థలలో కనీస వసతులు కూడా లేవన్నారు. జిల్లాలో కొత్తగా ప్రారం భించిన గురుకులాలకు ఇప్పటివరకు సొంత భవనాలు లేవని అద్దె భవనాల్లో ఆరకొర వసతులతో నడుస్తున్నాయ ని తెలిపారు. కొన్నింటిలో లెక్చరర్స్‌, ఉపాధ్యాయులు, వార్డె న్సు కూడా లేరన్నారు. కేజీబీ, కాలేజ్‌ హాస్టల్స్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హాస్టల్లో రీసైక్లింగ్‌ బియ్యాన్ని పిల్లలకు పెట్టి సన్నబియ్యమని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండి అక్బర్‌, సతీష్‌ మాట్లాడుతూ పరిగి డివిజన్‌ ప్రాంతంలో ఐటిఐ కాలేజ్‌ని వెంటనే ప్రారంభించాలని, పరిధిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వెంటనే సొంత భవనాలు నిర్మించా లని, గురుకుల పాఠశాలలోనికి విద్యార్థి సంఘాలను రా కుండా ప్రభుత్వం సర్కులర్‌ జారీ చేయడం సిగ్గుచేటని అ న్నారు. జిల్లా వ్యాప్తంగా కార్పొరేటు పాఠశాలల ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలను బలహీన పరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీపు జాత జిల్లాలో ఉన్న అన్ని రా ష్ట్రాల్లో జూనియర్‌ డిగ్రీ కాలేజీలను సందర్శించి సమస్య లను తెలుసుకొని, ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌, అనిల్‌, మహమూద్‌, రాకేష్‌, నితిన్‌, రాజు, గోపాల్‌, శ్రీకాం త్‌ తదితరులు పాల్గొన్నారు.