రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో జలకళ

నవ తెలంగాణ- రెంజల్:
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం జలకలతో ఉట్టిపడుతుంది. గత నాలుగైదు రోజులుగా ఎగువ భాగంలో వర్షాలు కురవడం తో కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం జలకళ ఉట్టిపడుతుంది. మహారాష్ట్ర గోదావరి తో పాటు, మంజీరా నదులు పొంగిపొర్ల తుడ్డడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మత్స్యకారులకు, గోదావరికి విచ్చేసే భక్తులకు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఆదేశాలను జారీ చేసింది. పశువుల కాపరులు సైతం గోదావరి తీరాన అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గోదావరిలో పుణ్య స్థానంలో ఆచరించే భక్తులు గాట్లపైనే స్థానాలను ఆచరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.