మారుమూల గ్రామాల రోడ్లు మరమ్మతులు

జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
మారుమూల గ్రామాలకు ప్రజలు రాకపోకలు సాగిం చడానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి గ్రా మాల అభివృద్ధికి తోడ్పడుతుందని జడ్పీటీసీ బొక్క జంగా రెడ్డి అన్నారు. శుక్రవారం కందుకూరు మండల్‌ కొత్త గూడ నుండి పెరుగుడ వయా బాచుపల్లి వెళ్లే దారి వెడల్పు చేసే పనులు సర్పంచ్‌ యారాల శ్రీనివాస్‌ ఆధ్వర్యం లో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రూ.8 లక్షల నిధులు మంజూరు చేయడంతో రోడ్డు పనులు ప్రారంభించారన్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతి పాండు, బీఆర్‌ ఎస్‌ మండల అధ్యక్షులు మన్నే జేయందర్‌, డైరెక్టర్‌, కృష్ణ రెడ్డి దీక్షిత్‌ రెడ్డి, ఆనంద్‌, శేఖర్‌ రెడ్డి, ఎంపీటీసీ కాకి రా మలు, జైత్వరం ఎంపీటీసీ సురేష్‌, సర్పంచ్‌ గోవర్ధన్‌, గ్రామ పెద్దలు, భూపాల్‌ రెడ్డి ఇటమోని రామలు, మద్దెల రామలు, కొంత అంజి రెడ్డి, కృష్ణ రెడ్డి, కొంతం బాల్‌ రెడ్డి, మద్దెల శ్రీశైలం, కుమ్మరి నర్సింహా, విష్ణు మూర్తి, లిం గారెడ్డి, జంగయ్య, కృష్ణ, వెంకటేష్‌, నర్సింహా బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షులు, రాజు, నరేష్‌, నవీన్‌, అనంత్‌, ఆగమయ్య, కత్తుల శ్రీశైలం ప్రకాష్‌ కుమార్‌, కుమార్‌ పాల్గొన్నారు.