మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్స్‌ 2023 ఉపసంహరణ

న్యూఢిల్లీ : ఇటీవల జారీ చేసిన మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్స్‌ 2023ను నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సోమవారం ఉపసంహరించుకుంది. ఎంబిబిఎస్‌ ప్రవేశాల కోసం ఈ నెల 12న మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్స్‌ 2923ను ఎన్‌ఎంసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాంపెటెన్సీ బేస్డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎంఈ) పాఠ్యాంశాలతో సహా మెడికల్‌ కాలేజీల్లో పరిశోధన సౌకర్యాలు, మానవ వనరుల నియామకం, వికలాంగుల కేటగిరి కింద విద్యార్థుల ప్రవేశానికి సంబంధించిన కొత్త నియమాలు ఉన్నాయి. అయితే ఈ నిబంధలన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయని అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వీటిని ఎన్‌ఎంసి ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త మార్గ దర్శకాలు ఎప్పుడు జారీ చేయబడతాయో లేదా ఏ మార్గదర్శకాలను అనుస రించాలో ఎటువంటి సమాచారం లేకుండానే మార్గదర్శకాలను ఎన్‌ఎంసీ ఉపసంహరించుకోవడం విశేషం. అలాగే ఉపసంహరణకు ఎలాంటి కారణా లను కూడా ఎన్‌ఎంసీ పేర్కొనలేదు.