నవతెలంగాణ – ఆళ్ళపల్లి
మండల కేంద్రంతో పాటు అనంతోగు, మర్కోడు, రాయిపాడు, పాతూరు, రామాంజిగూడెం, రాఘవాపురం, నడిమిగూడెం, బోడాయికుంట, పెద్ద వెంకటాపురం, అడవి రామారం, దొంగతోగు, తదితర గ్రామాల్లో శుక్రవారం 75 గణతంత్ర దినోత్సవ వేడుకలు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అందులో భాగంగా మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ లంకపల్లి భద్రయ్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అలాగే స్థానిక పోలీస్ ఠాణాలో ఎస్సై ఈ.రతీష్, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో ఎం.రామారావు, అటవీ శాఖ రేంజ్ కార్యాలయంలో రేంజర్ కె.నరసింహారావు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి అర్వపల్లి రేవంత్, కేజీబీవీలో స్పెషల్ ఆఫీసర్ వి.పద్మ, జిన్నెలగూడెం గ్రామం జీపీఎస్ లో హెడ్ మాస్టర్ జోగా రాంబాబు, జాకారం గ్రామం ఎంపీపీఎస్ లో హెడ్ మాస్టర్ షేక్ మహమూద్ పాషా, అనంతోగు గ్రామం ఏజీహెచ్‌ఎస్ లో హెచ్.ఎం బి.భావుసింగ్, తునికిబండల గ్రామం జీపీఎస్ లో హెచ్.ఎం ఈ.నరేష్, పాతూరు గ్రామం పాఠశాలలో హెచ్.ఎం ఎం.చిరంజీవి, ఆళ్ళపల్లి హైస్కూల్ లో హెచ్.ఎం కె.శాంతారావు, ఎంపీపీఎస్ లో హెచ్.ఎం భూక్యా రమేష్, తదితర అధికారులు, ఉద్యోగులు తమ తమ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, పిల్లలకు, పెద్దలకు మిఠాయిలు పంచారు. ఆయా చోట్ల జరిగిన ఈ గణతంత్ర వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.