– జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్
నవతెలంగాణ-మణుగూరు
ఏరియా పివి కాలనీలోని భద్రాద్రి స్టేడియంలో ఈ నెల 26వ తేదీన నిర్వహించబడే 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ సంబందిత అధికారులతో భద్రాద్రి స్టేడియం, పివి కాలనీ గ్రౌండ్‌లోని నిర్వహించే పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ మాట్లాడుతూ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను వీక్షించే వారికి, అన్నీ పాఠశాలల నుంచి వచ్చే విద్యార్ధులకు తగిన ఏర్పాట్లు చేయాలని, అలాగే వారికి తాగు నీటి సదుపాయం, వాళ్ళు కూర్చోవడానికి టెంట్లు, పాఠశాల విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడలాని తెలిపారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు సంబందించిన పనులను సత్వరమే పూర్తి చేయాలని సంబందిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో వీసం కృష్ణయ్య, ఏజిఎం (సివిల్)డి వేంకటేశ్వర్లు, డిజిఎం పర్సనల్ ఎస్.రమేశ్, ఎస్‌ఈ శోభన్ బాబు, ఈఈ( సివిల్) డి.విఎ.స్‌ఎ.న్ ప్రవీణ్, సివిల్ అధికారులు తదితరులు పాల్గొన్నారని అధికారి ప్రతినిధి డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్ ఒక ప్రకటనలో తెలియ జేశారు.