జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని వినతి

నవతెలంగాణ-ధర్మసాగర్ : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దాటికొండ రాజయ్యకు వినతిపత్ధాన్ని సమర్పించిన జర్నలిస్టులు. సోమవారం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తాతకొండ రాజయ్య స్థానిక రైతు వేదికలో పల్లెనిద్ర కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు స్థానిక జర్నలిస్టులతో ఇస్టా గోస్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు వారితో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశానుసారం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి,డబుల్ బెడ్ రూమ్ నిర్మించే కార్యక్రమాలు చేపట్టాలనే ఉత్తర్వులను ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమాన్ని తమ వంతు సహాయ సహకారాలు అందించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సానుకలంగా స్పందించి, సంబంధిత అధికారులకు చేరవానిలో మాట్లాడి వారికి త్వరలో ఎండ స్థలాలు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఇసంపల్లి రమేష్,పోలుమారి గోపాల్, గజ్జల సుమన్, శివలాల్ యాదవ్, నాగవల్లి దుర్గారాజ్, పోలుమారి అనిల్, ఇమ్మడి కమలాకర్, రమేష్, పెసరు ఆగయ్య, గంగారం సుధాకర్, కొట్టే శ్రీధర్, చిట్యాల రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు.