నవతెలంగాణ-ధారూరు
నవతెలంగాణ వికారాబాద్ జిల్లా పత్రికలో సోమవా రం అభివృద్ధికి ఆమడ దూరంలో దళితవాడలు అనే శీర్షిక తో ప్రచురితమైన కథనానికి సర్పంచ్ తొంట పరమేశ్ స్పం దించి కొండాపూర్ కాలన్‌లో తాత్కాలిక రోడ్డును వేయిం చారు. మండల పరిధిలోని కొండాపూర్ కలాన్ గ్రామంలో దళితవాడలు అభివృద్ధికి నోచుకోకుండా మారిపోతున్నా యి. దీంతో పిల్లలు, పెద్దలు అనారోగ్యం పాలవుతున్నారు. కరెంటు లేక ఇబ్బదులతో గ్రామస్తులు అనేక సార్లు మండ ల అధికారులకు ఎమ్మెల్యే మంత్రులకు కలెక్టర్‌లకు ఫిర్యాదు లు చేసినా ఫలితం లేదు. పత్రికా కథనానికి స్పందించిన గ్రామ సర్పంచ్ కొండాపూర్ కలాన్‌లో తాత్కాలిక రోడ్డు వేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో సీసీ రోడ్డు వేయాలని గ్రామస్తులు సర్పంచ్‌ను కోరారు.