బంధన్‌ ఎంఎఫ్‌ నుంచి రిటైర్మెంట్‌ ఫండ్‌

హైదరాబాద్‌ : పదవీ విరమణ అనంతరం వ్యయాల లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడటానికి బంధన్‌ రిటైర్మెంట్‌ ఫండ్‌ను ప్రారంభించినట్టు బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వెల్లడించింది. ఈ కొత్త ఫండ్‌ 2023 సెప్టెంబర్‌ 28న తెరవబడి.. అక్టోబర్‌ 12న ముగుస్తుందని ఆ సంస్థ సీఈఓ విశాల్‌ కపూర్‌ తెలిపారు. ”అధిక ఆయుర్దాయం, పెరుగుతున్న జీవన వ్యయం, ఆరోగ్య సంరక్షణ, ద్రవ్యోల్బణం పెట్టుబడిదారుల పొదుపు లను తగ్గించగలవు. పదవీ విరమణ తర్వాత అదే జీవన ప్రమాణాన్ని కొనసాగించడం తప్పనిసరి. వీటిని అధిగమించడానికి రిటైర్మెంట్‌ ఫండ్‌ను ఆవిష్కరించాం. పదవీ విరమణ తర్వాత ఓ పద్దతిలో నగదు ఉపసంహరణకు ఇది వీలు కల్పిస్తుంది.” అని విశాల్‌ పేర్కొన్నారు.