– ఆయనకు కాంగ్రెస్సే గోరీ కట్టడం ఖాయం : బీఆర్‌ఎస్‌ఎల్పీ ప్రెస్ మీట్‌లో మంత్రులు, ఎమ్మెల్సీలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘రేవంత్‌రెడ్డి తెలంగాణ వాదిన ని పదే పదే చెప్పు కుంటున్నారు. తెలంగాణ కోసం చేసిన ఓ గొప్ప పని ఏమిటో చెప్పగలరా? 2018 కన్నా ఘోరమైన పరిస్థితి 2023లో కాంగ్రెస్ కు రాబోతున్నది. ఆయన బతుకేందో అందరికీ తెలుసు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు. నిక్కర్, లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయి అంటున్నవ్… నీది చీటర్స్ పార్టీనా?’ అంటూ మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీష్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మండలి చీఫ్‌విప్ భానుప్రసాద్, ఎమెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, బస్వారాజు సారయ్య, తాతా మధు, ఎమ్మెల్యే లు గువ్వల బాలరాజు, ఎ.వెంకటేశ్వరరెడ్డి ఆగహ్రం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిలర్ అని విమర్శించారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్‌ఎల్పీలో బుధవారం వేర్వేరుగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లా డారు. గద్దర్ గౌరవాన్ని రేవంత్ తగ్గిస్తున్నారన్నారు. ఆయన శాసన సభ, మండలిలో సభ్యుడు కాకున్నా సంతాపం తెలిపామనీ, అధికారికంగా అంత్య క్రియలు చేయాలని కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. గద్దర్ మరణాన్ని ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తానంటే కుదరదన్నారు. పట్టుమని పది నియోజకవర్గాల్లో అభ్యర్థులను దించలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గోరీ కట్టడం ఖాయమన్నారు. పీసీసీ… పేమెంట్స్ కలెక్షన్ సెంటర్‌గా మారిందన్నారు.