– సీఎం సహాయ నిధికి ఒక రోజు వేతనం ప్రకటించిన ట్రెసా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వరద బాధితులకు రెవెన్యూ ఉద్యోగులు అండగా నిలిచారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒకవైపు వరద బాధితుల సహాయ చర్యల్లో ప్రత్యక్షంగా విధులు నిర్వహిస్తూనే, మరో వైపు వాటి వల్ల నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి రెవెన్యూ ఉద్యోగులంతా ఆగస్టు నెలలో ఒక రోజు వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు రెవెన్యూ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్ ద్వారా సీఎం సహాయనిధికి సంబంధించిన అంగీకార పత్రాన్ని ప్రభుత్వానికి సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షులు కె.నిరంజన్, రమేష్‌పాక, కార్యదర్శి చిల్లా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ నజీమ్‌ఖాన్, సీసీఎల్‌ఏ యూనిట్ అధ్యక్షులు ఎల్లారెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కె.రామకష్ణ, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.