వలస ఆదివాసీలకు మంచినీటి రోలింగ్‌ క్యాన్లు అందజేత

నవతెలంగాణ-పినపాక
పినపాక మండల పరిధిలోని వలస గిరిజన గ్రామాలు ఎర్రగుంట, టేకులగూడెం, గ్రామస్తుల మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు డిఆర్డిఎ, ఐటిడిఏ ద్వారా మంజూరైన వాటర్‌ రోలింగ్‌ క్యాన్లను పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆదివారం అందజేశారు. 50 కుటుంబాలకు క్యాన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వలస ఆదివాసీలు మంచినీరు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న క్రమంలో వారి సమస్యకు పరిష్కారం చూపేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఉప్పాక సర్పంచ్‌ సుజాత, ఉపసర్పంచ్‌ రామారావు, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ రాము, సామాజిక కార్యకర్త తోలం శ్రీను, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.