వృత్తిదారులకు రూ.లక్ష సహకారమందించాలి

 A contribution of Rs.1 lakh should be made to the professionals– నిధుల పెంపుపై అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేయాలి : తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య
– హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద నిరసన
నవతెలంగాణ-సిటీబ్యూరో
కులవృత్తుల ఆర్థిక పథకం దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని, అర్హత కలిగిన వృత్తిదారులకు తక్షణమే రూ.లక్ష ఆర్థిక సహకారం అందించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్‌ చేశారు. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం గ్రేటర్‌ హైదరాబాద్‌ సౌత్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌కు, బీసీ అభివృద్ధి అధికారి ఆశన్నకు అందజేశారు. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ.. జీవో 5 ప్రకారం కులవృత్తుల ఆర్థిక సహకారం పథకం కింద అందిన ఆన్‌లైన్‌ దరఖాస్తులను గ్రేటర్‌ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ద్వారా వెరిఫికేషన్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. నెల రోజులు గడుస్తున్నా పాతబస్తీలోని చార్మినార్‌, యాకుత్‌పూర, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్‌, నాంపల్లి ఏరియాలో జీహెచ్‌ఎంసీ అధికారులు వెరిఫికేషన్‌ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రని విమర్శించారు. అదేవిధంగా వెరిఫికేషన్‌ పూర్తయిన లబ్దిదారులకు వెంటనే లక్ష రూపాయల చెక్కు అందించాలని డిమా ండ్‌ చేశారు. తమ అనుచరులకే లబ్ది చేకూర్చేలా స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరే టర్లు, ఇతర ప్రజాప్రతినిధుల జోక్యం పెరిగిం దని, అలాకాకుండా అర్హత కలిగిన వృత్తిదారులకు, పేదలకు ఈ పథకం వర్తించే విధంగా అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కులవృత్తుల ఆర్థిక పథకం (బీసీ బంధు) నిధుల పెంపుపై ఆగస్టు 3 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో ప్రకటన చేయాలని కోరారు.
టీఆర్‌వీఎస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కార్యదర్శి ఎం.బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇండ్లు, ఇంటి స్థలాలు లేని వృత్తిదారులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ ఆస్ప త్రులు, పోలీస్‌ శాఖలో కులవృత్తి కాంట్రాక్ట్‌ను స్థానిక సొసైటీలకు ఇచ్చేవిధంగా గైడ్‌లైన్‌ విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్య క్షులు పి.రాములు, జిల్లా ఉపాధ్యక్షులు పి.సంజీవ జిల్లా కమిటీ సభ్యులు జి.వెంకటేష్‌, కె.శ్రీనివాస్‌, పి.రజిత, టి.హేమలత, టి.మల్లికార్జున్‌, ఆర్‌.బాబు, ఎస్‌.బాలేష్‌, ఎన్‌.బాబు సూరిబాబు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.