రైతు ప్రభుత్వం..బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

– చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేవెళ్ల మండలంలోని 5 రైతు వేదికలలో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొని ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతును రాజు చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు వెళ్తూ రైతుల మన్ననలను పొందుతున్నారని గుర్తు చేశారు. రైతు సంక్షేమంలో దేశంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలుస్తుందని అన్నారు. రైతు బంధు, రైతు భీమాతో పాటుగా 24 గంటల విద్యుత్‌, సకాలంలో ఎరువులు, పంటలకు గిట్టుబాటు ధరలు, నకిలీలపై ఉక్కుపాదంతో పూర్తిగా రైతు పక్ష పాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనిచేస్తున్నారని తెలిపారు. అనంతరం రైతులు, అధికారులు అందరూ కలిసి భోజనాలు చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మిట్ట వెంకట రంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మెన్‌ నర్సిములు, బీఆర్‌ ఎస్‌ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్‌, మండల బీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు తోట శేఖర్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షడు శేరి శివారెడ్డి, ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షుడు బక్కరెడ్డి రవీందర్‌ రెడ్డి, మండల జనరల్‌ సెక్రెటరీ అధ్యక్షుడు నరేందర్‌ గౌడ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, ఏఓ తులసి, ఆయా గ్రామాల ఏఈవోలు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, ఆయా గ్రామాల బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.