సాయి చందు సేవలు మరువలేనివి..

– ప్రముఖ గాయకుడు సాయి చందు చిత్రపటానికి ఘనంగా నివాళి..
– ప్రముఖ గాయకుడు యశ్పాల్
నవతెలంగాణ సుల్తాన్ బజార్
చాదర్ఘాట్ ఆది హిందూభవన్ లో ఆది హిందూ సోషల్ సర్వీస్ లింగ్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సాయి చందు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రముఖ కవి గాయకులు యశ్పాల్. సిటీ కాలేజీ తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ కోటేశ్వరరావు. సామాజిక కార్యకర్త లింగస్వామి. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ జ్ఞాన ప్రకాష్ లు సాయి చందు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి చందు మారుమూల గ్రామంలో పుట్టి అంచలంచలుగా తన రచన,గానంతో ఉన్నత స్థానానికి చేరుకున్నారని చెప్పారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని చెప్పారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. ఆయన పాట లు ఇప్పటికీ మారు మ్రోగుతూనే ఉన్నాయని చెప్పారు. ఆయన చేసిన సేవలు హినలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి అజయ్ గౌతమ్. తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ జాయింట్ డైరెక్టర్ కాకమాను శశి శ్రీ. ట్రస్టు సభ్యులు. గాయకులు రచయితలు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు