చిల్డ్రన్స్‌ డేకి సైంధవ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌

For Children's Day
Saindhav's special giftవెంకటేష్‌ నటిస్తున్న తన 75వ చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి సోమవారం చిల్డ్రన్స్‌ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్‌ ఓ స్పెషల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. పోస్టర్‌లో బేబీ సారాని బైక్‌ పై స్కూల్‌కి తీసుకెళ్తూ చిరునవ్వుతో కనిపించారు వెంకటేష్‌. ఇది చిల్డ్రన్స్‌ డేకి పర్ఫెక్ట్‌ పోస్టర్‌గా అందరినీ అలరిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘సైంధవ్‌ టీజర్‌కు నేషనల్‌ వైడ్‌గా ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. వెంకటేష్‌ని శైలేష్‌ కొలను మునుపెన్నడూ లేని ఇంటెన్స్‌ అవతార్‌లో ప్రెజెంట్‌ చేశారని ప్రశంసలు అందుకున్నారు. ఈనెల 21న సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌-‘రాంగ్‌ యూసేజ్‌’ లాంచ్‌ ద్వారా మ్యూజికల్‌ జర్నీని స్టార్ట్‌ చేయనున్నారు మేకర్స్‌. సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రం కోసం చార్ట్‌ బస్టర్‌ ఆల్బమ్‌ని కంపోజ్‌ చేశారు.
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలోనూ విడుదల కానుంది.
‘బలమైన కథ, అంతకుమించి ఎమోషన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు ప్రేక్షకుల్ని కచ్చితంగా థ్రిల్‌ చేస్తాయి. సరికొత్త వెంకీని చూడబోతున్నారు’ అని చిత్ర బృందం తెలిపింది.

Spread the love