
నిజామాబాద్ జిల్లావిద్యాశాఖ ఆద్వర్యంలో జిల్లా లోని 31 పాఠశాలలకు రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు డిచ్ పల్లి మండల కేంద్రంలోని మానవత సదన్ లో శాలసిద్ధి కార్యక్రమం పై 2 రోజుల అవగాహన కార్యక్రమం ను జిల్లా విద్యాశాఖాధికారి ఎన్ వి దుర్గ ప్రసాద్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపిక చేసిన 31 పాఠశాలల నుండి ఉపాధ్యాయులకు శాల సిద్ది అవగాహన శిబిరం నిర్వహిస్తున్నా మన్నారు. శాలసిద్ది నమోదు ప్రక్రియను కచ్చితంగా వాస్తవంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ రెండు రోజుల శిబిరంలో ప్రతి ఒక్కరు పూర్తిగా అవగాహన పొందాలని సూచించారు. శాలసిద్ది కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో పాఠశాలల సర్వతో ముఖాభివృద్ధి జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గ ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు శ్రీనివాస్ రావు, చంద్రశేఖర్, వాణిమా, రిసోర్స్ పర్సన్లు సంతోష్ కుమారి, మధుసూదనాచారి, సచ్చిదానంద్ తోపాటు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.