
తెలంగాణ బీసీ యువజన సంక్షేమ సంఘం నగర అధ్యక్షునిగ విష్ణు ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ శుక్రవారం నియమించారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి యువతకు మార్గదర్శకులుగ నూతన అధ్యక్షులు నిలబడాలని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు ఆకాంక్షించారు. నూతన యువత నగర అధ్యక్షులు నిబద్దతతో పని యువతకు ఆదర్శంగా నిలబడాలని సంఘం నగర అధ్యక్షులు దర్శనం దేవేందర్ అన్నారు. తనను నమ్మి ఇన్ని రోజులు బాధ్యతలు తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా రాష్ట్ర నాయకులకు ధన్యవాదములు నూతన యువజన నగర అధ్యక్షులు విష్ణు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, బుస్స ఆంజనేయులు, ధర్శనం దేవేందర్, శ్రీలత, విజయ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.