బోడకాకర కాయల సీజన్ ప్రారంభమైంది. రెండు నెలలు మాత్రమే లభించే ఈ బోడ కాకర కాయల్లో అనేక పోషక విలువలున్నాయి. కండ్లకు మంచిది. రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూపోతే దీనితో లాభాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే..
– బోడకాకరలో ఫోలేట్స్ అధికశాతం ఉంటాయి. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
– డయాబెటిక్ పేషంట్లకు బోడకాకర ఎంతో మంచిది. రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది.
– ఇందులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.
– యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే క్యాన్సర్, ఇతర ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కూడా కాపాడుతుంది.
– ఇందులోని కెరోటినాయడ్స్ కంటి సంబంధిత వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను నియంత్రిస్తాయి. అందుకే బోడకాకరతో పులుసు, ఫ్రై, పొడి చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
– అధికంగా ఉండే ఫోలేట్స్ వల్ల గర్భస్థ శిశువు ఎదుగుదల బాగుంటుంది. ఇందులోని కెరోటినాయడ్స్ కంటి సంబంధిత వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది.