– ఉత్సాహంగా పాల్గొన్న డిసిహెచ్ డా.రవిబాబు
నవతెలంగాణ-ఇల్లందు
తెల్లటి దుస్తులు ధరించి నిత్యం పేషంట్లకు సేవలు చేస్తూ బిజీ బిజీగా గడిపే ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది ఎంతో ఉత్సాహంగా వైద్యశాల ఆవరణలో గురువారం ఘనంగా సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రత్యేకంగా డిసిహెచ్ అధికారి,ఇఎన్టి వైద్యులు డాక్టర్ రవిబాబు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు నర్సులు, హెడార్సులు ఇతర సిబ్బంది అంతా కొత్త బట్టలతో ముస్తాబై అంతా కలిసి రంగురంగుల రంగవల్లులను వేశారు. భోగి మంటల్లో పాత వస్తువులు వేశారు. కట్టెల పొయ్యి వెలిగించి పాలు పొంగించారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. వైద్యశాల ఆవరణలో సంక్రాంతి సంబరాల నిర్వహణ దశ్యాలను చూస్తే ఇది వైద్యశాలైనా అన్నట్లు మైమరిపించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిబాబు మాట్లాడుతూ నిత్యం పేషెంట్లకు వైద్య సేవ అందిస్తూ టెన్షన్ గా గడిపే వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు,సిబ్బంది కొంతసేపు దష్టి మరల్చి ఉత్సాహంగా, సంతోషంగా ఉండడానికి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.