నవతెలంగాణ -కంటేశ్వర్
ఆల్ ఇండియా క్యారం సంఘం గౌరవ ఉపాధ్యక్షుడిగా జిల్లా క్యారం సంఘం అధ్యక్షుడు, నవ్య భారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్, క్యాతం సంతోష్ కుమార్ ఆల్ ఇండియా క్యారం సంఘం ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవలే నగరంలోని నవ్య భారతి గ్లోబల్ పాఠశాలలో ఐపీఎల్ 20- 20 మాదిరిగా అంతర్జాతీయ స్థాయిలో డెక్కన్ ప్రీమియర్ క్యారం లీగ్ సీజన్ 2 సంతోష్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాతం సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. క్యారం అభ్యున్నతికి గ్రాస్ రూట్ మారుమూల గ్రామాల నుండి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి రాష్ట్ర, జాతీయ స్థాయి లో రాణించే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఎంపిక పట్ల రాష్ట్ర బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షులు మంతెన రాజేందర్ రెడ్డి, ఒలంపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఈగ సంజీవరెడ్డి, బొబ్బిలి నర్సయ్య, జిల్లా క్యారమ్ సంఘం కార్యదర్శి భూమారెడ్డి , పేట సంఘం అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్ రెడ్డి మల్లేష్ గౌడ్ సభ్యులు రాజేందర్, మోయిజ్, అబ్దుల్ , సూరి , ఇతర సంఘాల ప్రతినిధులు అంద్యాల లింగయ్య, సాయగౌడ్, సుబ్బారావు, కోచ్ నాగరాజు తదితరులు అభినందిచారు.