మణుగూరు : భారతదేశంలో వాహన రంగంలో గత కొన్ని దశాబ్దాలుగా కోట్లాది కస్టమర్లకు నాణ్యమైన సేవలందిస్తూ, అత్యధిక మార్కెట్ షేర్లు (50%) కలిగినటువంటి మారుతి సుజికి ఇండియా లిమిటెడ్ వారు తమ సేవలను విస్తణరలో భాగంగా అత్యాధునిక హంగులతో, నూతన సాంకేతికతో కూడిన నూతన సంతోష్ మారుతి షోరూంను స్థానిక గుట్టమల్లారం, మణుగూరులో రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు కాంతారావు ప్రారంభించారు. మారుతి సుజికి వారు భారతదేశ ప్రజలకు గత కొన్ని దశాబ్దాలుగా తమ వాహన శ్రేణిని అభివృద్ధి చేసుకుంటూ నాణ్యమైన సేవలను అందుస్తున్నారని అన్నారు. అటువంటి సంస్థ నూతనంగా ఇప్పుడు మణుగూరులో నూతన షోరూంను ప్రారంభించటం గర్వకారణంగా వుందన్నారు. సంతోష్ మారుతి యం.డి చుక్కపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ సంతోష్ మారుతి తమ సంస్థ కష్టమర్లకు నాణ్యమైన సేవలను అందిస్తున్నందుకు గాను మారుతి సుజుకి వారి అత్యున్నతమైన పురస్కారాలైనటువంటి రాయల్ ప్లాటినం అవార్డుతో సత్కరించారన్నారు. చైర్మన్ చుక్కపల్లి జగన్ మోహన్ రావు మాట్లాడుతూ తమ సంస్థ ప్రస్తానం 1983లో ప్రారంభమై వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తూ వారి ఆశీస్సులతో దిన దినాభివృద్ధి చెందుతుందన్నారు. తమ సేవలను ఇంకా విస్తరిస్తూ వినియోగదారులకు చేరువవుతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా సింగరేణి జనరల్ మేనేజర్ దుర్గం రామచంద్ర, మణుగూరు డిఎస్పి ఎస్.రాఘవేంద్రరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తోట తిరుపతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ చుక్కపల్లి కృష్ణ ప్రసాద్, సంతోష్ మారుతి, సీఈవో గుంటుపల్లి శ్యామ్ కుమార్, సంతోష్ మారుతి, ఏజీఎం అబ్దుల్ హమీద్, బ్రాంచ్ మేనేజర్ రవికుమార్ పాల్గొన్నారు.