
మండలంలోని కేశ్ పల్లి గ్రామములో హరితహారం లో భాగంగా ఈతమెక్కలు నాటినట్టు సర్పంచ్ మహేశ్వర్ తెలిపారు. గ్రామంలోని సర్వే నంబర్ 1173,1218/1 లో దాదాపు 1000 ఈత మొక్కలను నాటారు.ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ గంగాధర్, మండల టిఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ దివెష్, ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ సాగర్, గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.