వజ్రఖండి ప్రభూత్వ పాఠశాలలో అక్షరబ్యాసం చేయించిన సర్పంచ్..

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని వజ్రఖండి ప్రభూత్వ పాఠశాలలో గ్రామ సర్పంచ్ సంజీవ్ పాటీల్ విద్యార్థులకు అక్షరబ్యాసం చేయించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెుదటగా పాఠశాల అవరణలోని చదువులతల్లి సరస్వతి విగ్రహనికి హెచ్ఎం రోషిత్ ఆద్వర్యంలో ప్రత్యేత పూజలు నిరేవహించారు. అనంతరం పిల్లలకు, వారితల్లి దండ్రులకు సూతనలు చేసారు. ప్రతి ఒక్కరు విద్యనబ్యసించినప్పుడే నవ సమాద నిర్మాణం గట్టిపునాదులతో నిర్మించ వచ్చని, విద్యలేని వాడు వింత పశువు అని సామేత గుర్తు చేసారు. కార్యక్రమంలో సర్పంచ్ సంజీవ్ పాటీల్, హెచ్ఎం రోషిత్, ఉపాద్యాయబృందం, గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు.