– కార్మికుల సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు
– పెద్ద ఉమెంతల్ సర్పంచ్ శ్రీధర్ గుప్తా
నవతెలంగాణ-పూడూర్
12 రోజులుగా జీపీ కార్మికులు చేపట్టిన కార ణంగా గ్రామాల్లో పారిశుధ్య పనులు పూర్తిగా నిలిచి పోయాయి. కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా గ్రామాల్లో మురికి చెత్త ఇళ్ళ ముందు నిలిచిపో వడం తో దుర్వాసన వస్తుందని గ్రామస్తులు సర్పంచుల దగ్గరికి వెళ్లి వివరించడంతో సోమవారం మండల పరిధిలోని పెద్ద ఉమెంతల్ గ్రామ సర్పంచి కార్మికు లు ఎవరూ లేకపోవడంతో తానే స్వ యంగా ట్రాక్టర్ ఎక్కి గ్రామంలో వీధి వీధి తిరుగుతూ చెత్తను సేక రించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీధర్ గుప్త నవ తెలంగాణతో మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామపంచా యతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీ సుకోవాలని లేనిపక్షంలో గ్రామాల్లో ప్రజలు ఇబ్బం దులు పడుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశముందని సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని తెలిపారు.
12వ రోజుకు చేరిన జీపీ కార్మికుల సమ్మె
జీపీ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం 12వ రోజుకు చేరుకుంది కార్మికులంతా మండల కార్యాలయానికి చేరుకుని కార్యాలయం ఎదుట ప్రభుత్వం ఇప్పటికైనా ‘మా సమస్యలు పరిష్కరిం చాలి’ అని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మెలో కార్మికులు సంపత్ బందయ్యా నర్సింలు, లక్ష్మయ్య కాశయ్య ముజాహిద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.