కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి

– ఓసీని సందర్శించిన సింగరేణి డైరక్టర్లు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో సత్తుపల్లిలో శుక్రవారమున కిస్టారం ఓసి, సత్తుపల్లి జేవిఆర్‌ఓసి నందు గల డీజిల్‌ బంక్‌లను సింగరేణి సంస్థ డైరక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎన్‌వికే శ్రీనివాస్‌, డైరక్టర్‌ (పిఅండ్‌పి) జి.వేంకటేశ్వర రెడ్డి సందర్శించారు. అందులో భాగంగా ముందుగా సత్తుపల్లి గెస్ట్‌ హౌస్‌ నందు గల జీఎం ఛాంబర్‌ నందు సింగరేణి సంస్థ డైరక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎన్‌వికే శ్రీనివాస్‌, డైరక్టర్‌ (పిఅండ్‌పి) జి.వేంకటేశ్వర రెడ్డిలను కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో జీఎం ఛాంబర్‌ నందు కొత్తగూడెం ఏరియాలోని గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి, ఓబిల వెలికితీత గురించి, సత్తుపల్లి జేవిఆర్‌ఓసిబ నందు ఏర్పాటు చేసిన సిహెచ్‌పి ద్వారా జరిగే బొగ్గు రవాణా గురించి, బెల్టుల ద్వారా బొగ్గు రవాణాకు ఎటువంటి ఆటంకం కలుగ కుండా బెల్టు జాయింట్లను ఎప్పుడు పరిశీలిస్తూ ఉండాలని కొత్తగూడెం ఏరియా జిఎం జక్కం రమేష్‌కు సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా జిఎం జక్కం రమేష్‌, జిఎం స్టోర్స్‌ పి.చిన్నా బసివిరెడ్డి, ఏరియా ఇంజనీర్‌ వై.రఘు రామి రెడ్డి, ఏజిఎం పర్సనల్‌ సామ్యూల్‌ సుధాకర్‌, జేవిఆర్‌ఓసి పిఓ వెంకటా చారి, కిస్టారమ్‌ ఓసి పిఓ నరసింహా రావు, పిఈ ఐవిఎస్‌బి లక్ష్మణ మూర్తి, హరినారాయణ, అధికారులు పాల్గొన్నారు.