రంగంలోకి దిగిన సత్యభామ

into the field landed Satya Bhamaఅగ్ర కథానాయిక కాజల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘సత్యభామ’. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ఆమె కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ”మేజర్‌” చిత్ర దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ, స్క్రీన్‌ ప్లే అందించారు. సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘హత్యకు గురైన ఓ యువతిని రక్షించే క్రమంలో ఆమె ప్రాణాలు కాపాడలేక పోతుంది పోలీస్‌ ఆఫీసర్‌ సత్యభామ. ఆ యువతిని చంపిన హంతకుల వేట మొదలుపెడుతుంది. ఈ వేటను మన ఇతిహాసాల్లో నరకాసుర వధ కోసం యుద్ధరంగంలో అడుగుపెట్టిన సత్యభామ సాహసంతో పోల్చుతూ ప్లే అయ్యే బ్యాక్‌ గ్రౌండ్‌ సాంగ్‌ టీజర్‌లో ఆకట్టుకుంటోంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉండే ఈ సినిమా అందర్నీ మెప్పిస్తుందనే దీమాని మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు.