రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : సత్యవతి రాథోడ్

– రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి
నవతెలంగాణ-గోవిందరావుపేట
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంమని రాష్ట్ర గిరిజన,  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.శనివారం గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామ రైతు వేదిక లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎడ్ల బండి ఎక్కి ర్యాలీతో  రైతులను ఆనందపరుస్తూ రైతు వేదిక ప్రాంగణానికి  మంత్రి, జడ్పీ చైర్మన్, కలెక్టర్,  ఎస్పీ చేరుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన,  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్,  జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్,  జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య,  ఎస్పీ గౌస్ ఆలం,  అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇలా త్రిపాఠి, ఓ ఎస్ డి అశోక్ కుమార్ లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన మండలం గోవిందరావుపేట అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కి రైతుల పాలిట ఎంతో ప్రేమ ఉందని నేడు జరుపుకుంటున్న రైతు దినోత్సవ కార్యక్రమాలను చూస్తే అర్థమవుతుందని మంత్రి అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా,  రైతు బంధు,  ఆయిల్ ఫామ్ సాగు కు సబ్సిడీ పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి అన్నారు.
రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి సకాలంల వారి అకౌంట్లో డబ్బులు కూడా జమ చేస్తున్నామని గుర్తు చేశారు.
ములుగు జిల్లా చివరిగా ఏర్పడినప్పటికీ జిల్లా పై ఎంతో ప్రేమ చూపిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మెడికల్ కాలేజ్ సమీకృత భవనానికి 65 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభంలో ఉన్నాయని ఆమె గుర్తు చేశారు.దశాబ్ది ఉత్సవంలో భాగంగా 22 తారీకు వరకు సంక్షేమ సంబరాలు  అంబరాన్ని అంటేలా నిర్వహించుకుంటున్నా మని వివరించారు.తాగునీరు సమస్యలు తలెత్తకుండా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి సాగునీరుకు ప్రాధాన్యత కల్పిస్తూ చెరువుల పూడిక తీతతో బీడు భూముల్లో పచ్చదనం వెల్లివిరిసేలా వ్యవసాయానికి పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి దేనని ఆమె కొనియాడారు.ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దశబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుందనీ అన్నారు. ఆనాడు ఐదు దశాబ్దాల పాటు ఉద్యమాలు చేసి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత మనదేనన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధికి అధిక ప్రాధాన్య ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోవిందరావుపేట మండలం వ్యవసాయ ప్రాధాన్యత కలిగిందని ఈ మండలంలో పెద్ద రైతులు ఉన్నారని అన్నారు.ఈ మండలంలో ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రైతులు అధిక దిగుబడి తో ఎక్కువ లాభాలు పొందవచ్చాని అన్నారు. రైతులకు విత్తనాలు ఎరువులు సకాలంలో అందేలా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం ప్రతిరోజు గ్రామాల వారీగా రైతులకు అందుబాటులో ఉంటూ వ్యవసాయ సాగుపై పలు సూచనలు ఇస్తున్నారని వారి ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ రైతులకు అందుబాటులో ఉంటున్నారని వారి కృషి ని అభినందించారు.అనంతరం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల డాక్యుమెంటరీ చిత్రాలను ఎల్ఈడి స్క్రీన్ పై ఆసక్తిగా మంత్రి రైతులతో కలిసి తిలకించారు.అనంతరం రైతులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి,  సర్పంచ్ ఈ సం సమ్మయ్య,  డి ఆర్ డి ఓ నాగ పద్మజ,  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గౌస్ హైదర్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, డి డబ్ల్యు ఓ ప్రేమలత, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ హేమలత,  ట్రైబల్ వెల్ఫేర్ డిడి పోచం, తహసిల్దార్ రాజ్ కుమార్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,  గ్రామ పంచాయతీ సిబ్బంది,  గ్రామ రైతులు,  మహిళలు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.