ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను

SC ST Declaration– దేశవ్యాప్తంగా ప్రకటించాలి
– మంత్రి సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో ఎంపీ కవిత, ప్రభుత్వ విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్‌రావుతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్లలో ప్రకటించిన డిక్లరేషన్‌ మోసపూరితమైందని విమర్శించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీలు వెనుకబాటుకు కాంగ్రెస్‌ కారణమన్నారు. కర్నాటకలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని తెలిపారు.