ఐసీఐసీఐ బ్యాంక్ లో రూ.8.68కోట్ల కుంభకోణం..

– డిప్యూటీ మేనేజరే పక్కదారి పట్టించేశాడు..
– రీజినల్ మేనేజర్ ఫిర్యాదు..కేసు నమోదు..
నవతెలంగాణ -నర్సంపేట
ఐసీఐసీఐ నర్సంపేట బ్రాంచీలో రూ.8.68కోట్ల భారీ కుంభకోణం వెలుగు చూసింది.సీఐ రవికుమార్ కథనం మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ లో డిప్యూటీ మేనేజరే గా పని చేస్తున్న బైరిశెట్టి కార్తిక్ పలువురి ఖాతాదారుల పేరిట సాధారణ రుణాలు, బంగారు రుణాలు ఇచ్చినట్లు చిత్రీకరించాడు.బ్యాంకు మేన్ అకౌంట్ నుంచి తన అకౌంట్లో కి పలు దఫాలుగా ట్రాన్స్ఫర్ చేసుకొన్నాడు.లావాదేవిలలో తేడాలు రావడాన్ని బ్యాంకు అధికారులు గుర్తించారు. ప్రత్యేక అధికారాలు విచారణ చేపట్టగా రూ.8.68కోట్ల పైచిలుకు పక్కదారి పెట్టినట్లు నిర్థారణ చేశారు.ఈ అవినీతిపై రీజినల్ మేనేజర్ ఓరిగంటి శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ కుంభకోణానికి పాల్పడిన డిప్యూటీ మేనేజర్ కార్తీక్ ను అదుపులో తీసుకున్నట్లు చెప్పారు.