లక్ష సాయం దరఖాస్తుల పరిశీలన

– ప్రతీనెల 15న బీసీ కులవత్తుల వారికి లక్ష సాయం
– సాయం కోసం 5,28,862 అప్లికేషన్లు : మంత్రి గంగుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వెనుకబడిన వర్గాలకు రూ.లక్ష సహాయం కోసం క్షేత్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రారంభమయిందని మంత్రి గంగుల కమలాకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 5,28,862 దరఖాస్తులు వచ్చాయనీ, వర్గాల వారిగా బీసీ ఏ 2,66,001 మంది, బీసీ బీ 1,85,136, బీసీ డి 65,310, ఎంబీసీలు 12,415 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. దరఖాస్తుల క్రమసంఖ్య ప్రకారం పరిశీలన కొనసాగుతుందని వివరించారు. ప్రతీ నెల ఐదో తారీఖు వరకు పరిశీలన పూర్తైన వారికి అదేనెల 15న స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందజేస్తామని మంత్రి గంగుల తెలిపారు.