అధీకృత దుకాణంలో నే విత్తనాలు కొనుగోలు చేయాలి : ఎం.ఎ.ఒ నవీన్

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వ గుర్తింపు పొందిన,వ్యవసాయ శాఖ అధీకృత దుకాణంలో నే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మండల అధికారి నవీన్ సూచించారు. ఎరువులు,విత్తనాలు పై అవగాహన కల్పించే క్రమంలో మండలంలోని గాండ్లగూడెంలో రైతులకు నకిలీ విత్తనాలు,ఎరువులు పై పలు సూచనలు,సలహాలు ఇచ్చారు.ఎరువులు,విత్తనాలు కొనుగోలు సమయంలో రసీదు పొందాలని అన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు బ్రాండ్ లతో పోలిన ఇతర ఎరువులు,విత్తనాలు విక్రయిస్తుంటే పోలీసులకు,వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్.హెచ్.ఒ ఎస్.ఐ రాజేష్ కుమార్,హెచ్.ఈ.ఒ రాయుడు దుర్గారావు లు పాల్గొన్నారు.