నవతెలంగాణ – చండూరు: మునుగోడు నియోజకవర్గం అంతా జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించాలని చండూరు జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం కోరారు. శనివారం గట్టుప్పల మండల కేంద్రంలో బిఆర్ఎస్ ప్రవేశపెట్టిన పెట్టిన సంక్షేమ పథకాలను గడపగడప కు తిరుగుతూ వివరించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ సిసి రోడ్లు ఏర్పాటు జరిగాయి అన్నారు. ప్రభాకర్ రెడ్డి నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తి అని ప్రజా సంక్షేమ కోసమే పాటుపడే వ్యక్తి అన్నారు. అలాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే నియోజకవర్గానికి ఇబ్బందికరమన్నారు. ఇది ఏమైనా ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు గడ్డపై గులాబీ జెండా గురవేయవలసిన అవసరం మనందరి పైన ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే చూసి ఇతర పార్టీల నుండి భారీగా చేరుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ తోనే సమగ్ర అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పచ్ కుమారి ఇడం రోజా, కైలాసం ,అవ్వారి శ్రీనివాస్ చే రుపల్లి భాస్కర్,ఎంపీటీసీ లు బండారి చంద్రయ్య బొడిగా వెంకటేశం సీనియర్ నాయకులు పాల్గొన్నారు.