
ఎన్నికల కోడ్ నేపథ్యంలో సోమవారం పోలీసులు విస్తృత తనిఖీల భాగంలో రేవల్లి గ్రామానికి చెందిన నరారి శ్రీను బెల్ట్ షాపులో 13.9 లీటర్ల మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శివకుమార్ వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అక్రమంగా మద్యం తరలిస్తున్న శ్రీను అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఎస్ఐ శివకుమార్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నిబంధనలు అమలులో ఉండడంతో, ( మద్యం & డబ్బులు ) అక్రమంగా తరలిస్తే, ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవంటూ పట్టణ ఎస్ఐ శివకుమార్ హెచ్చరించారు.