బీసీల అభ్యున్నతికే ఆత్మగౌరవ భవనాలు

– మ్యాట్‌ చైర్మెన్‌ అల్లం నారాయణ
నవతెలంగాణ-హైదరాబాద్‌
హైదరాబాదులో శుక్రవారం జరిగిన రాష్ట్ర పెరిక సంఘం సమావేశంలో అల్లం నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈనెల 27న తెలంగాణ పెరికకుల ఆత్మగౌరవ భవనానికి భూమి పూజ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీష్‌ రావు, గంగుల కమలాకర్‌ , తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వి శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయం చాలా గొప్పదని గర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల వికాసానికి ఆత్మగౌరవ భవనాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన చెప్పారు.