సీనియర్‌ సిటిజన్స్‌ దయచేసి గమనించండి

Senior man (80s) climbing staircase.

యునైటెడ్‌ స్టేట్‌ లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం 51శాతం పైగా వృద్ధులు మెట్లు ఎక్కేటప్పుడు పడిపోతున్నారట. ప్రతి సంవత్సరం చాలా మంది అమెరికన్లు మెట్లు ఎక్కేటప్పుడు పడి చనిపోయారట కూడా. 60 సంవత్సరాల దాటిన వారు ఈ పది నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

1. మెట్లు ఎక్కవద్దు. తప్పక ఎక్కవలసి వస్తే మెట్ల కేసు రైలింగ్‌లను గట్టిగా పట్టుకొని ఎక్కండి.
2. తలను వేగంగా తిప్పకండి. కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోవచ్చు.
3. కాలి బొటనవేలును తాకడానికి శరీరాన్ని వంచే ముందు మీ శరీరాన్ని అందుకు సన్నద్ధం చేసుకోండి.
4. ప్యాంటు వేసుకునేటప్పుడు కూర్చునే వేసుకోండి.
5. నిలబడి ఒక్కసారిగా పడుకోకుండా శరీరానికి ఒక వైపు (ఎడమ చేతి వైపు, లేదా కుడి చేతి వైపు) నుండి కూర్చోని పడుకోండి.
6. ఒకేసారి వ్యాయామం చేయకుండా, ముందుగా అందుకు మీ శరీరాన్ని సన్నద్ధం చేయండి. అంటే ఒకేసారి శరీరాన్ని పూర్తిగా వంచవద్దు.
7. వెనుకకు నడవకండి. వెనుకకు పడటం వలన తీవ్రమైన గాయం అవుతుంది.
8. భారీ బరువును ఎత్తడానికి ఒకేసారి నడుము వంచవద్దు. ముందుగా మోకాళ్ళను వంచి, సగం చతికిలబడినప్పుడు వస్తువును పైకి ఎత్తండి.
9. మంచం మీద నుండి వేగంగా లేవకండి. మంచం నుండి లేవడానికి ముందు కొన్ని నిమిషాలు వేచి ఉండండి.
10. వాష్‌రూమ్‌లో అధిక శక్తిని (ఒత్తిడిని) ఉపయోగించవద్దు. సహజంగా రావనివ్వండి.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి. మరియు అన్ని బాధలకూ దివ్య ఔషధం చిరునవ్వు ఒకటే.
ఎన్ని కష్టాలు వచ్చినా సరే గుండె నిబ్బరంతో ఉంటూ పెదవులపై నీ చిరునవ్వుని ఎప్పటికీ చెదరనివ్వకు. నీ చిరునవ్వుకి నీ కష్టాలు దాసోహం అవుతాయి నేస్తం!