నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలో గార్లపాడు మాజీ సర్పంచ్ సీపీఐ(ఎం) నాయకులు తాతా వెంకయ్య భార్య తాత కమలమ్మ(74) సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలికి భర్త వెంకయ్య, ఒక కుమారుడు ఉన్నారు. కమలమ్మ గ్రామంలో భర్తతో కలిసి సీపీఐ(ఎం) అభివృద్ధికి కృషి చేశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతదేహాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మాదినేని నారాయణ, లక్ష్మీపురం ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, లక్ష్మీపురం సహకార సంఘం అధ్యక్షులు మాదినేని వీరభద్ర రావు, గార్లపాడు ఎంపిటిసి ముక్కపాటి అప్పారావు, గార్లపాడు ఉప సర్పంచ్ తాత లక్ష్మీనారాయణ, సిపిఎం గార్లపాడు శాఖ కార్యదర్శి తాత వీరయ్య, మాజీ శాఖా కార్యదర్శి ముక్కపాటి నాగేశ్వరరావు సందర్శించి నివాళులర్పించారు. సిపిఎం మండల కమిటీ సభ్యులు కొమ్మినేని నాగేశ్వరరావు, నాయకులు ఏడునూతల లక్ష్మణరావు, కళ్యాణపు శ్రీనివాసరావు, వల్లం కొండ సురేష్, కారంగుల చంద్రయ్య, మాదినేని రామచంద్రరావు, వల్లంకొండ వెంకటేశ్వర్లు, గుడికందుల కృష్ణ, డీసిసిబి మాజీ ఉపాధ్యక్షుడు ఉమ్మనేని కోటయ్య, గోవిందాపురం ఎల్ గ్రామ సర్పంచ్ ఉమ్మనేని బాబు, ఆర్‌ఎంపిడబ్ల్యూఏ జిల్లా ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ ధనమూర్తి తదితరులు సందర్శించి నివాళులర్పించారు.