– వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే సతీమణి సబితాఆనంద్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ మెతుకు సబితాఆనంద్ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా బసు పాస్‌లు అంద జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో మూడు వేల మందికి ఉచితంగా బస్ పాసులు అందజేసినుటత్ట తెలిపారు. సమాజం మనకే ఏమిచ్చింది అనే దాని కంటే సమాజానికి మనం ఏం చేశా మన్నదే ముఖ్యం అన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్య క్షులు డి.ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్ రమేష్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ పి.విజయకుమార్, డాక్టర్ ముద్ద భక్తవస్థలం, వికారాబాద్ బస్ డిపో మేనే జర్ భక్షినాయక్, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు భారతి, ఉపాధ్యాయులు శ్రీలత, నర్సమ్మ, ఆర్టీసీ సిబ్బంది, పార్టీ నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.